Mon Dec 23 2024 16:24:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ముందస్తు బెయిల్ పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ నేడు జరగనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ నేడు జరగనుంది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఈ కేసును విచారించనున్నారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో వందల కోట్లు చేతులు మారాయని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఫైబర్ నెట్ కేసులో...
అయితే అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించినా హైకోర్టులో ఫైబర్ నెట్ కేసులో మాత్రం లభించలేదు. 17 ఏ విచారణ చేపట్టి తీర్పు వెలువరించిన తర్వాత దీనిపై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ప్రకారమే నేడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Next Story