Sat Nov 16 2024 18:43:16 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు బీపీ డౌన్.. పట్టుకోల్పోవడంతో
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ కు బీపీ డౌన్ కావడంతో అదుపు తప్పి రోడ్డుపక్కన పడిపోయింది
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ కు బీపీ డౌన్ కావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఆనుకుని ఒరిగిపోయింది. కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న టీఎస్ఆర్టీసీ బస్సు భద్రాచలం వెళుతుండగా కత్తిపూడి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో...
డ్రైవర్ భాస్కర్రావు బస్సు నడుపుతుండగా ఒక్కసారి బీపీ డౌన్ కావడంతో బస్సు అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాలను నిర్వహించారు. బస్సు డ్రైవర్ తో పాటు గాయాలపాలయిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Next Story