Mon Dec 23 2024 13:41:17 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటిమిట్టలో 30న శ్రీరామనవమి
ఒంటిమిట్టలోని కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 వరకు వాహనసేవ ఉంటుందని తెలిపింది.
వార్షిక బ్రహ్మోత్సవాలు...
రోజూ సాయంత్రం 6 నుంచి 9 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈనెల 30న శ్రీరామనవమి వేడుకను, బమ్మెర పోతన జయంతిని వైభవంగా నిర్వహిస్తామని చెప్పింది. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
Next Story