Mon Dec 23 2024 14:17:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మొద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్ల ధరలను పెంపు నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్ల ధరలను పెంపు నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సేవా టిక్కెట్ల ధర పెంచుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. బోర్డు మీటింగ్ లో కేవలం దీనిపై చర్చ మాత్రమే జరిగిందని, నిర్ణయం తీసుకోలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండేళ్ల తర్వాత సర్వదర్శనం ప్రారంభించామని చెప్పారు. సర్వదర్శనం ప్రారంభించిన తర్వాత భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు.
సామాన్య భక్తులకు....
సర్వదర్శనం ప్రారంభించి పది రోజులు అవుతుందని, భక్తుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్న ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉత్తర భారత దేశం నుంచి వచ్చే యాత్రికుల కోసం చపాతీలు అందిస్తామని చెప్పారు. వీఐపీల తాకిడి తగ్గించి సామాన్యులకు దర్శనం కల్గించేందుకే టీటీడీ కృషి చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story