Wed Dec 25 2024 01:32:19 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శారదాపీఠానికి టీటీడీ నోటీసులు
శారదాపీఠానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునేందుకు నోటీసులు జారీ చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు
శారదాపీఠానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునేందుకు నోటీసులు జారీ చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్నితిరుమలలో భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
సిబ్బంది నియామకం...
భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అన్న ప్రసాదం సత్రంలో సిబ్బంది తగినంత లేరని, అదనపు సిబ్బందిని నియమించుకోవడానికి టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని చేపడతామన్నఆయన తిరుమలలో అందుతున్న సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ రాస్తామనిచెప్పారు. కంచి కామకోటి పాఠశాలకు రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story