Sat Apr 26 2025 17:06:53 GMT+0000 (Coordinated Universal Time)
లడ్డూ వివాదంపై నేడు సీఎంకు ఈవో నివేదిక
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ ఈ వో శ్యామలరావు సమావేశం కానున్నారు. లడ్డూ వివాదంపై చర్చించనున్నారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ ఈ వో శ్యామలరావు సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక సమర్పించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను వివరించనున్నారు. నివేదిక అందించిన తర్వాత తిరుమలలో నిర్వహించునున్న శాంతియాగం గురించి వివరించనున్నారు.
లడ్డూ వివాదం...
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించనుంది. శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్నారు. టీటీడీ ఈవో నిన్న అందించిన ప్రాథమిక నివేదికపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Next Story