Wed Dec 25 2024 06:55:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇది వింటే చాలు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడకదారిలో వెళ్లే భక్తులకు 10 వేల టికెట్లు జారీకి ఓకే చెప్పింది
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి వద్దకు చేరుకోవడానికి శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా నడక మార్గాన చేరుకుంటారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్యను మరింత పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోవడం ప్రశంసలను కురిపిస్తుంది.
టిక్కెట్ల సంఖ్య పెంచి....
శ్రీవారి మెట్టుమార్గంలో నడిచే వారికి నాలుగు వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు ఆరు వేలు టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం నడకదారి భక్తులకు టికెట్ల జారీ పెంపుతో భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నడకదారి భక్తులకు టికెట్లు జారీ చేయాలనే డిమాండ్ గత కొన్నిరోజులుగా వినిపిస్తోంది. అయితే ఏపీలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరుమలలో కొన్ని సత్వర చర్యలను ప్రారంభించారు ఈ నిర్ణయాలకు భక్తుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
Next Story