Sat Nov 23 2024 00:44:32 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు... పాలక మండలి నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో ఘాట్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు మూడో ఘాట్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. కొండ చరియలు విరిగిపడి భక్తుల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతుండటంతో మూడో ఘాట్ రోడ్డును నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే బాలపల్లి - తిరుమల అన్నమయ్య ఘాట్ రోడ్డును మూసివేయాలని, ఇది ప్రమాదకరంగా పరిణమించిందనది భావించింది.
మరో నడకదారి...
తిరుమలకు మరో నడక దారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగదని భావించింది. జవవరి 13న వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి పదిరోజులు తెరిచ ఉంచాలని సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం గోపురానికి బంగారు తాపడం చేయించాలన్న ప్రతిపాదనకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ధ్వంసమైన ఆలయాలను పునర్మించాలని నిర్ణయించారు.
Next Story