Mon Dec 23 2024 17:12:26 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనునంది.
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనునంది. సెప్టెంబరు నెల కోటాను ఈ నెల విడుదల చేస్తారు. మొత్తం 46,470 టిక్కెట్ల లక్కీడిప్ ద్వారా 8,070 టిక్కెట్లను కేటాయించనున్నారు.
ఆర్జిత సేవ టిక్కెట్లు...
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన టిక్కెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం విడదలు చేయనుంది. ఇందుకోసం భక్తులు ఈరోజు ఉదయం పది గంటల నుంచి జూన్ 29 వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఆన్ లైన్ టిక్కెట్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్లను పొందిన వారి జాబితాను ఈ నెల 29న టీటీడీ వెబ్ సైట్ లో ఉంచుతుంది. వీరంతా రెండురోజుల్లో టిక్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
Next Story