Mon Dec 23 2024 14:11:57 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల కొండపైకి వాహనాల అనుమతి రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా 12 వేల వాహనాలకు మించి అనుమతించరు.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పన్నెండు వేల వాహనాలకు మించి అనుమతించరు. అలిపిరి వద్దనే మిగిలినవి నిలిపివేస్తారు. భక్తులు తిరుమలకు ఆర్టీసీ బస్సుల్లో రావాల్సి ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కొండపైకి అనుమతించని వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ద్విచక్ర వాహనాలను...
అయితే ప్రతి ఏటా గరుడ వాహన సేవ రోజున తిరుమల ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఈసారి గరుడ సేవ అక్టోబరు 1వ తేదీన జరగుతుంది. అందుకే ఈ నెల 30 వతే దీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ తిరుమల కొండ పైకి ద్విచక్రవాహనాలను అనుమతించరు. బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో తరలి వస్తారని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story