Tue Dec 24 2024 00:45:43 GMT+0000 (Coordinated Universal Time)
అందుబాటులోకి రెండో ఘాట్ రోడ్డు
తిరుమల వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో ఘాట్ రోడ్ ను అందుబాటులోకి తేనుంది
తిరుమల వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో ఘాట్ రోడ్ ను రేపటి నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో తిరుమలలో ఒక ఘాట్ రోడ్డును టీటీడీ మూసివేసింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు అవస్థలు పడుతున్నారు. ముంబయి ఐఐటీ నిపుణులు కూడా ఘాట్ రోడ్డును పరిశీలించి టీటీడీకి నివేదిక ఇచ్చారు.
వైకుంఠ ఏకాదశికి....
కొద్దిరోజులుగా టీటీడీ రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు చేపట్టింది. అది పూర్తికావడంతో రేపు రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జనవరి 11వ తేదీ రాత్రికల్లా రెండో ఘాట్ రోడ్డు నుంచి వాహనాలను అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండో ఘాట్ రోడ్డును తెరవనున్నట్లు టీటీడీ తెలిపింది.
Next Story