Mon Dec 23 2024 07:32:48 GMT+0000 (Coordinated Universal Time)
వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శన టోకెన్ల విడుదల ఏప్రిల్ 8కి వాయిదా
నేటి నుంచే టోకెన్లను జారీ చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దర్శన టికెట్లను..
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా టోకెన్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచే టోకెన్లను జారీ చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దర్శన టికెట్లను జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్ వేర్ ప్రాబ్లమ్ తలెత్తిందని అందుకే టోకెన్లను జారీచేయలేకపోతున్నట్లు టిటిడి ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం టికెట్ల జారీని ఏప్రిల్ 8కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు టోకెన్లను ఆన్ లైన్ విధానంలో జారీ చేయనున్నట్లు టిటిడి వివరించింది. కాగా.. రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో టిటిడి అన్నిదర్శనాలు, స్వామివారి సేవలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తోంది.
Next Story