Mon Dec 23 2024 07:56:46 GMT+0000 (Coordinated Universal Time)
టిటిడి కీలక నిర్ణయం.. టోకెన్లు ఉన్నవారికే తొలుత దర్శనం
నేరుగా దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న కంప్యూటర్ స్కానింగ్ కేంద్రంలో అప్పటికప్పుడు కంప్యూటర్లు
తిరుపతి : తిరుమలలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం నిన్న భక్తుల మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం వరకూ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకే ముందుగా స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఈఓ రమేష్ బాబు వెల్లడించారు. టోకెన్లు లేకుండా నేరుగా సర్వదర్శనం లైన్లో వచ్చే భక్తులను ఆ తర్వాత అనుమతిస్తామని తెలిపారు.
నేరుగా దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న కంప్యూటర్ స్కానింగ్ కేంద్రంలో అప్పటికప్పుడు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రతి భక్తుడు ఒక లడ్డూ పొందేలా టోకెన్లు ఇచ్చారు. రోజుకు 25 వేల లోపు భక్తులు వస్తే అదే రోజు దర్శనం ఉంటుందని, ఈ సంఖ్య 60 వేలు దాటితే దర్శనానికి సుదీర్ఘ సమయం పడుతుందని ఈఓ వివరించారు. దర్శనం వరకూ క్యూ కాంప్లెక్స్ లలో ఉండే భక్తులకు నీరు, అన్న ప్రసాదాలు అందించే ఏర్పాట్లు చేసినట్లు రమేష్ బాబు పేర్కొన్నారు.
Next Story