Fri Nov 22 2024 11:58:16 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కానుకలను వేలం వేయనున్న టీటీడీ
అలా వచ్చిన కానుకల్లో వాచీల రూపంలో వచ్చిన కానుకలను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. జూన్ 22న..
తిరుమల గిరులు ప్రతినిత్యం భక్తులు చేసే గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు స్వామివారికి నగదు లేదా వస్తురూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. అలా వచ్చిన కానుకల్లో వాచీల రూపంలో వచ్చిన కానుకలను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. జూన్ 22న వాచీలను వేలం వేయనుండగా.. టైటాన్, టైమెక్స్, సొనాట, టైమ్ వెల్, ఆల్విన్, క్యాషియో, ఫాస్ట్ ట్రాక్ వాచీలు వేలానికి రానున్నాయి. కొత్తవి, పాతవి, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం లాట్లు ఈ వేలంలో ఉంచారు. వివరాలకు www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
అలాగే హుండీ ద్వారా వచ్చిన బియ్యాన్ని కూడా 28న వేలం వేయనుంది. ఇందులో మిక్స్డ్ బియ్యం 13,080 కేజీలు టెండర్, వేలంలో ఉంచనున్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2 వరకూ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు జూన్ 29న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.
Next Story