Mon Dec 23 2024 23:06:55 GMT+0000 (Coordinated Universal Time)
రెండున్నరేళ్లలో తొలిసారి బీజేపీకి వ్యతిరేకంగా?
రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు తొలిసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు
రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు తొలిసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చంద్రబాబు స్పందించారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని చంద్రబాబు అన్నారు. ప్రధానంగా వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మొండి చేయి చూపిందన్నారు. ఆదాయపు పన్ను మినహాయంపుపై కరోనా సమయంలో ఎందరో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు నీరుగార్చారన్నారు చంద్రబాబు.
నదుల అనుసంధానాన్ని....
అయితే నదుల అనుసంధానాన్ని చంద్రబాబు స్వాగతించారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ రంగంలో సంస్కరణలను మంచి పరిణామమనని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి విఫలమయిందని చంద్రబాబు ఆరోపించారు. 28 మంది ఎంపీలుండి వైసీపీ రాష్ట్రానికి ఏం సాధించిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా బడ్జెట్ పై చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా స్పందించడం రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి.
Next Story