Sun Dec 22 2024 21:10:44 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో డ్రోన్ల వినియోగంపై జాతీయ సదస్సు
డ్రోన్ల వినియోగంపై ఈ నెల 22, 23న మంగళగిరిలో రెండ్రోజుల జాతీయ సదస్సు జరగనుంది
డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్స్ వినియోగానికే కాదు తయారీకీ ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంగా నిలపాలని భావిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎక్కువగా డ్రోన్లపైనే ఆయన దృష్టి పెట్టారు.
ఈ నెల 22, 23 న...
భవిష్యత్ అంతా డ్రోన్ల తోనే ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే డ్రోన్ల ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు కూడా డ్రోన్ల ద్వారానే బాధితులకు ఎక్కవ సంఖ్యలో ఆహారం, మంచినీటిని పంపిణీ చేశారు. వ్యూహాత్మక ప్రణాళికను ఈ నెల 22, 23న మంగళగిరిలో జరిగే రెండ్రోజుల జాతీయ సదస్సులో చాటనుంది.
Next Story