Thu Apr 03 2025 01:11:45 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోరోనా బారిన పడ్డారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోరోనా బారిన పడ్డారు. మాజీ హోంమత్రి సుచరితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా కరోనా సోకింది. వీరికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల తమతో కాంటాక్టు అయిన వాళ్లంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
పెరుగుతున్న కేసులు...
ఇటీవల గడపగడప కు ప్రభుత్వం కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినా వందల సంఖ్యలోనే కరోనా కేసులు రోజు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసుల సంఖ్య మరింత పెరుగుతాయని అంటున్నారు.
Next Story