Mon Dec 23 2024 03:56:09 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ సీటు కింద రెండుపాములు.. డ్రైవ్ చేస్తుండగా కాలిని చుట్టేసి..
తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో వెలుగుచూసింది. ఒక లారీ మెకానిక్ షెడ్ వద్ద లారీ ఓనర్..
సాధారణంగా పామును అల్లంత దూరంలో చూస్తేనే వెన్నులో వణుకు పడుతుంది. కొంతదరైతే వీడియోల్లో కనిపించే పాములకు కూడా భయపడిపోతుంటారు. కారణం వాటివల్ల ప్రాణహాని ఉండటమే. కోబ్రా వంటి పాములైతే.. మనిషిని నిలువెల్లా చుట్టేసి ప్రాణం తీసేస్తాయి. పాము కాటు చాలా డేంజర్. సరైన సమయంలో పాముకాటు వేసిన మనిషికి విరుగుడు ఇవ్వకపోతే.. దానివిషం శరీరమంతా వ్యాపించి ప్రాణాలు కోల్పోతారు. అలాంటి పాములు అప్పుడప్పుడు ఇళ్లలో, నడిచే దారిలో.. ఒక్కోసారి బైక్ ఇంజన్లలో, సీట్ల కింద కనిపిస్తుంటాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో వెలుగుచూసింది. ఒక లారీ మెకానిక్ షెడ్ వద్ద లారీ ఓనర్ కుందేటి సతీష్ బైక్ పార్క్ చేసి.. తన పని చూసుకుంటున్నాడు. ఏదో పని నిమిత్తం మెకానిక్ తో కలిసి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకూ వెళ్లి వస్తున్న క్రమంలో అతని కాళ్లకు జెర్రిగొడ్డు పాము చుట్టుకుంది. కాలికి ఏదో తగిలినట్టు అనిపించి చూస్తే .. పాము. అంతే ఒక్కసారిగా అతని గుండె జారిపోయినంత పనైంది. భయంతో బైక్ ను వదిలేసి కిందకి దూకేసిన సతీష్ ను జెర్రిగొడ్డు కరవబోయింది. తృటిలో దాని నుంచి తప్పించుకుని హమ్మయ్య అనుకునే లోపే బైక్ సీటు కింద త్రాచు పాము కనిపించింది. తనపై పాములు పగబట్టినట్టు కనిపించడంతో సతీష్ కు ముచ్చెమ్మటలు పట్టాయి. స్థానికులు బైక్ సీటు కింద ఉన్న త్రాచు పామును కర్రలతో కొట్టి చంపారు.
Next Story