Sun Dec 22 2024 22:51:04 GMT+0000 (Coordinated Universal Time)
11 రోజులు.. పెళ్లిళ్లే పెళ్లిళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ కావడంతో సందడిగా మారనున్నాయి.
నేటి నుంచి పెళ్లి ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్యాణ మండపాలన్నీ ముందుగానే బుక్ అయి పోయాయి. ఈరోజు రాత్రి ముహూర్తంతో పెళ్లిళ్లు ప్రారంభమవుతున్నాయి. 3,4,5,6,7,8 తేదీల్లో పెళ్లి ముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు. దీని తర్వాత 14,16,17,18 వరకూ వివాహాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి.
మాఘమాసం వరకూ...
మాఘమాసం వచ్చే వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకలు లక్షల సంఖ్యలోనే జరుగుతున్నాయి. ముందుగానే కల్యాణ మండపాలను, క్యాటరింగ్ లను బుక్ చేసుకున్నారు. కరోనా తర్వాత పెళ్లిళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరవుతున్నారు. దీంతో పెద్ద పెద్ద కల్యాణమండపాలను స్థాయిని బట్టి బుక్ చేసుకున్నారు. అలాగే పురోహితులకు కూడా డిమాండ్ పెరిగింది. ఈరోజు అర్థరాత్రి నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయని పండితులు చెబుతున్నారు.
Next Story