Tue Dec 24 2024 01:07:28 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు.. రాకపోకలపై నిషేధం
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు అడవిలో ఉన్న చిరుతపులులు రహదారులపైకి వచ్చే అవకాశముందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టంబరు నాటికి చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలిపారు. వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు చేసిన సూచనతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
వన్యప్రాణుల సంచారంతో...
దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత టూ వీలర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల విషయంలో రక్షణ చర్యలు పెంచాలని డిసైడ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తిరుమల కొండకు చేరుకునే మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమకు సహకరించాలని కోరారు. వచ్చే దారి, వెళ్లే దారిలో కూడా వాహనాలను అనుమతించరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతిస్తారు.
Next Story