Mon Dec 23 2024 15:21:37 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ కార్యాలయానికి గంటా.. హాట్ టాపిక్
రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు.
రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు గత రెండేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణను నిరసిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే రాజీనామాను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.
రెండేళ్ల తర్వాత....
ఇటీవల చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు. అలాంటిది ఈరోజు టీడీపీ కార్యాలయానికి ఆయన రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కార్కకర్తలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. రెండేళ్ల నుంచి పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆవిర్భావ దినోత్సవం నాడు రావడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఆవిర్భావంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమయిందని ఆయన అన్నారు.
Next Story