Mon Dec 23 2024 09:31:19 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి.
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు. వేద పండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తొలుత దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించిన అనంతరం జగన్ దంపతులు ఉగాది వేడుకలలో పాల్గొన్నారు.
రాష్ట్రానికి మంచి...
జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను జగన్ ప్రారంబించారు. అనంతరం జగన్ దంపతులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అన్ని రకాల కష్టాల నుంచి ఏపీ బయటపడుతుందని పండితులు పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఆర్థిక సమస్యల నుంచి కూడా రాష్ట్రం బయటపడుతుందని పేర్కొన్నారు.
Next Story