Mon Dec 23 2024 15:03:28 GMT+0000 (Coordinated Universal Time)
రాజీ పడితే జగన్ కు రాజకీయం లేనట్లే : ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు
రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ కు సత్సంబంధాలు ఉండవచ్చని, అందులో తప్పు లేదని, అయితే న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై వెనక్కు తగ్గకూడదని ఉండవల్లి హితవు పలికారు. ఇప్పటికే జగన్ అనేక విషయాల్లో రాజీ పడినట్లు అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ విభజన పై....
అమరావతిపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అదేరోజు ఏపీ విభజన అంశాలపై చర్చ జరిగిందని, కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హాజరై తాము విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారన్నారు. దీనిపై విచారిస్తే పండోరా బాక్స్ ను ఓపెన్ చేసినట్లవుతుందని అన్నారు. ఇది జగన్ కు తెలిసే జరుగుతుందా? నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటున్నారా? అన్నది తేలాల్సి ఉందన్నారు. తెలిసి జరిగితే జగన్ ఆంధ్రప్రదేశ్ కు మోసం చేస్తున్నట్లేనని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
Next Story