Sun Dec 22 2024 02:12:15 GMT+0000 (Coordinated Universal Time)
బాబ్బాబు.. ఓపిక పట్టండి... నేడు బుజ్జగింపులు "డే"
ఉండి ఎమ్మెల్యే రామరాజు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు
ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు అమలాపురంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయనతో మాట్లాడి బయటకు వచ్చారు. ఉండి టిక్కెట్ విషయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న రగడకు ఫుల్స్టాప్ పెట్టాలని చంద్రబాబు రామరాజును పిలిపించారు. ఆయనతో మాట్లాడారు. అయితే చంద్రబాబుతో మాట్లాడి వచ్చిన అనంతరం రామరాజు మాత్రం తాను ఉండిలో పోటీ చేసి తీరతానని చెప్పానని, మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దామని అన్నారు.
తిరుపతికి పవన్ కల్యాణ్...
మరో వైపు జనసేన అసంతృప్త నేతలను కూడా పవన్ కల్యాణ్ నేడు బుజ్జగించనున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామా చేయడంతో మిగిలిన అసంతృప్త నేతలతో పవన్ భేటీ కానున్నారు. ఈరోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల అనంతరం పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్లే అవకాశముందంటున్నారు. తిరుపతిలో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ నేతలతో పవన్ సమావేశయ్యే అవకాశాలున్నాయి.
Next Story