Thu Dec 19 2024 12:28:16 GMT+0000 (Coordinated Universal Time)
గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా వేయండి
గ్రూప్-2 మెయిన్ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు
గ్రూప్-2 మెయిన్ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం హడావుడిగా గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారని తెలిపారు. అందువల్ల కొందరు ప్రిపేర్ కాలేకపోయారన్నారు.
ప్రిపేర్ అయ్యేందుకు...
గ్రూప్ 2 పరీక్ష ను గత ప్రభుత్వం తొందరగా పెట్టడంతో కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని అందువల్ల, ఈ వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరుతున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తే తాము ప్రిపేర్ కావడానికి సమయం సరిపోతుందని వారు తెలిపారు.
Next Story