Mon Dec 23 2024 14:15:37 GMT+0000 (Coordinated Universal Time)
2024 నాటికి నాసిన్ అకాడమీని పూర్తి చేస్తాం
నాసిన్ అకాడమీని 2024 నాటికి పూర్తి చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్టె టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ అకాడమీని 2024 నాటికి పూర్తి చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీనిని పూర్తి చేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ సంస్థకు నిర్మలా సీతారామన్ భూమి పూజ చేశారు. దీని నిర్మాణం కోసం మొదటి దశలో 729 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ నిధులను ఇప్పటికే కేటాయించామని చెప్పారు.
విభజన హామీలో భాగంగా...
ఏపీ విభజన హామీల్లో భాగంగా ఏపీలో నాసిక్ అకాడమిని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. అందుభాగంగానే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం కూడా చెల్లించామని చెప్పారు. ఇక్కడ ఐఆర్ఎస్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ సెక్రటరీ తరుణ బజాజ్, ఎంప గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story