Fri Dec 20 2024 19:56:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అనంతపురానికి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు మంంత్రి సీతారామన్ భూమి పూజ చేయనున్నారు. నాసిన్ సంస్థ ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయనుంది. నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా పాల్గొంటారు.
భారీ బందోబస్తు....
కేంద్రమంత్రులు అనంతపురం జిల్లాకు వస్తుండటంతో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. నాసిక్ సంస్థ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగే అవకాశముందని తెలియడంతో పోలీసులు కొందరిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story