Sun Dec 22 2024 21:28:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎన్నికల్లో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలేంటంటే?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ యా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి మిత్రులు వస్తుంటారని, వెళుతుంటారని అన్నారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. బీజేపీ సిద్ధాంతాలు ఎప్పుడూ మారవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తామ ఎన్డీఏలో ఉన్న మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదని, వారి కారణాలతో వారే బయటకు వెళ్లారంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.
కొత్త మిత్రులు వస్తున్నారంటూ...
అయితే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు. పొత్తు ధర్మాన్ని తాము ఎప్పుడూ ఉల్లంఘించలేదని కూడా అమిత్ షా అన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఏపీ ఎన్నికల విషయంలో పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందన్న అమిత్ షా అది ఎప్పుడన్నది తాను చెప్పలేనని అన్నారు. అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు వారు వచ్చి చేరుతుంటారని అమిత్ షా అన్నారు.
Next Story