Thu Apr 24 2025 08:35:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఐడీఎం ప్రాంగణాలకు కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. అయితే శనివారం రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా ఆరోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ జరిగే విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆదివారం ఉదయం...
శనివారం రాత్రికి విజయవాడలోని ఒక హోటల్ లో బసచేసిన అనంతరం 19వ తేదీన ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొంటారు. తర్వాత జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక బీజేపీ నేతలు చూస్తున్నారు.
Next Story