Thu Dec 19 2024 09:20:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీభవన్ విభజనపై సమావేశం
నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం జరుగుతుంది.
నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం జరుగుతుంది. నార్త్ బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై దృషట్ి సారించిన కేంద్ర హోం శాఖ తొలుత ఏపీ భవన్ విభజపై సమావేశం నిర్వహిస్తుంది.
ఆస్తుల పంపిణీ...
ఈ సమావేశంలో ఏపీకి, తెలంగాణకు సంబంధించిన వాటాల విషయంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. విభజన జరిగి తొమ్మిదేళ్లవుతున్నా ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజన నేటికీ జరగకపోవడంపై రెండు రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story