Thu Dec 19 2024 10:11:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ప్రభుత్వం మారుతుంది
ఆంధ్రప్రదేశ్ లో జవాబుదారీ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో జవాబుదారీ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పాలన బాధిస్తుందని ఆయన అన్నారు. మోదీ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ లోనూ మొదలు కాబోతుందని అనుారాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రజారంజక పాలనను అందించే ప్రభుత్వం త్వరలోనే ఏపీలో వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దుర్గమ్మను....
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు విజయవాడ వచ్చారు. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పండితులు స్వాగతం పలికారు. అనురాగ్ ఠాకూర్ వెంట బీజేపీ నేతలు సునీల్ దేవధర్, సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, గోకరాజు గంగరాజు తదితరులు ఉన్నారు.
Next Story