Tue Nov 19 2024 02:27:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్నూలుకు హైకోర్టుపై.. కేంద్రం స్పష్టీకరణ
హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైకోర్టును సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధలు వేసిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానంగా తెలిపారు. అయితే హైకోర్టును సంప్రదించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపితే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.
న్యాయ రాజధానిగా....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మూడు రాజధానుల అంశంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించింది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరమవుతాయి. అయితే వైసీపీ ఎంపీల ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కిరణ్ జిజు ఈ రోజు సమాధానం ఇచ్చారు. హైకోర్టును సంప్రదించి కేంద్రానికి ప్రతిపాదనలను పంపాలని ఆయన సూచించారు. తరలింపు, హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్రప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కిరణ్ జిజు తెలిపారు.
Next Story