Thu Dec 19 2024 06:48:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ నుంచి మూడు రైళ్లు ప్రారంభం
నేడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ఈ రైళ్లను కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. గుంటూరు స్టేషన్ కు వచ్చిన కిషన్ రెడ్డి మూడు రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులతో పాటు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.
సామాన్యుల ప్రయాణానికి...
హుబ్లి-నర్సాపూర్ ఎక్స్ప్రెస్, విశాఖ-గుంటూరు ఎక్స్ప్రెస్, నంద్యాల-రేణిగుంట రైళ్లను కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యధికంగా రైళ్లను ప్రారంభిస్తుందన్నారు. సామాన్యులకు రవాణా సౌకర్యం అందుబాటులో తెచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Next Story