Thu Apr 24 2025 15:29:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఛత్తీస్గఢ్ కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి
నేడు ఛత్తీస్గఢ్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించనున్నారు.

నేడు ఛత్తీస్గఢ్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఛత్తీస్ గఢ్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు గెవరా బొగ్గు గనిని పరిశీలించనున్నారు. బొగ్గు గనిలో ఉత్పత్తితో పాటు వివిధ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై చర్చించనున్నారు.
రెండు రోజుల పాటు...
తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్.ఈ.సీ.ఎల్ పనితీరుపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో కిషన్రెడ్డి భేటీకానున్నారు. బొగ్గుగనుల అంశంతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించనున్నారు. కిషన్ రెడ్డి రెండు రోజలు పాటు ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు.
Next Story