Thu Dec 19 2024 12:32:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెజవాడకు గడ్కరీ.. జగన్ తో కలిసి?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడకు రానున్నారు. రాష్ట్రంలో పూర్తయిన వివిధ జాతీయ రహదారులను గడ్కరీ ప్రారంభిస్తారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడకు రానున్నారు. రాష్ట్రంలో పూర్తయిన వివిధ జాతీయ రహదారులను గడ్కరీ ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా మంజూరు చేసిన ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేస్తారు. ఆయన తొలుత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన పలు ప్రాజెక్టులను గడ్కరీ జాతికి అంకితం చేయనున్నారు.
ఇరవై వేల కోట్ల విలువైన....
ఈరోజు జాతీయ రహదారుల సంస్థకు చెందిన 13,806 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను, రహదారి రవాణాశాఖకు చెందిన 7,753 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి అధికారులు నితిన్ గడ్కరీకి వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story