Fri Nov 22 2024 23:01:34 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయరట
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదని చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లే అనిపిస్తుంది. ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఫగ్గన్ సింగ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ట్రేడ్ యూనియన్లతో ఆయన బేటీ కానున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
ఏడాది నుంచి ఆందోళనలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. దీంతో ఏడాదికి పైగానే కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. నిరసనలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీతో సహా అధికార వైసీపీ, టీడీపీ, జనసేన కూడా ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అంటూ అన్ని రాజకీయ పక్షాలు నినదించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత ఊరట కల్గించేలా ఉన్నాయి. తాజాగా బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనాలని భావించి సింగరేణి అధికారులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పంపిన సంగతి తెలిసిందే.
Next Story