Mon Dec 23 2024 01:02:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : 24న ఏపీ బంద్ .. అప్రమత్తమయిన పోలీసులు
24న ఏపీలో బంద్ కు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి
24న ఆంధ్రప్రదేశ్ లో బంద్ కు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. ఏపీలో అంగన్వాడీ వర్కర్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కార్యకర్తలు మండిపడుతున్నారు. విధులకు హాజరు కాని వారిని వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న అంగన్ వాడీ పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది.
విధుల నుంచి ...
దీంతో పలు జిల్లాల్లో అంగన్ వాడీ వర్కర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లో చేరేందుకు వచ్చిన వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు ఈ మేరకు విధుల్లో చేరని వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంగన్ వాడీ వర్కర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే అంగన్ వాడీ వర్కర్ల తొలగింపునకు నిరసనగా ఈ నెల 24వ తేదీన బంద్ కు అఖిలపక్షం పిలుపునించ్చింది.
Next Story