Fri Nov 22 2024 19:32:57 GMT+0000 (Coordinated Universal Time)
తప్పుడు సమాచారాన్ని ధృవీకరించుకోండిలా
అమెరికా, భారత్ లలో తప్పుడు సమాచారాన్ని నిరోధించడం కీలకమైన అంశమని యూఎస్ కాన్సులేట్ జనరల్ డేవిడ్ మోయర్ అన్నారు.
అమెరికా, భారత్ దేశాల్లో తప్పుడు సమాచారాన్ని నిరోధించడం కీలకమైన అంశమని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రయూనివర్సటీలోని అమెరికన్ కార్నర్ లో జరిగిన వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. అసత్య, అర్థ సత్య వార్తలను కనుగొనడంపై ఏపీ తెలంగాణలోని టీవీ జర్నలిస్టులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తప్పుడు వార్తలను పసిగట్టడంలో ఈ శిక్షణ కీలకంగా మారుతుందని మోయర్ అన్నారు. అమెరికా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంబంధాలు భవిష్యత్ లో మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
క్రిటికల్ థికింగ్ టెక్నిక్....
ఫ్యాక్ట్ చెక్ కు సంబంధించిన ప్రాధమిక అంశాలను, టూల్స్ ను ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్, సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి జర్నలిస్టులకు వివరించారు హ్యాష్ ట్యాగ్ లు, అల్గారిథిమ్ లు, సోషల్ మాబ్ లు, ట్రోల్ ఫాంము, మీదియా మ్యానిప్యులేషన్ ల ప్రపంచంలో ఇప్పటి తరం జీవిస్తుందని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని పసిగట్టడం, దానిని తొలగించడం కీలకంగా మారిందని సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొన్నాల్సిన అవసరాన్ని తెలిపారు. సమాచారం వెల్లువలా వచ్చి పడుతున్న ఈ సమయంలో వాస్తవాలను కనిపెట్టడానికి క్రిటికల్ థికింగ్ టెక్నిక్ లను ఉపయోగించాలని ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ జర్నలిస్టులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Next Story