Mon Dec 23 2024 04:43:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో నేటి తో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. మొత్తం పది రోజుల పాటు ఈ దర్శనాన్ని నిర్వహించారు
తిరుమలలో నేటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. మొత్తం పది రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. డిసెంబరు 23వ తేదీన మొదలయిన ఉత్తర ద్వార దర్శనం నేటితో ముగియనుంది. అంటే దాదాపు పది రోజుల పాటు ఈ దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతించింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా టిక్కట్లను టీటీడీ విక్రయించింది.
నలభై కోట్ల రూపాయలు...
పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నలభై కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. పది రోజుల నుంచి అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో కేవలం ఉత్తర ద్వార దర్శనానికే అధికారులు అనుమతించారు. చివరి రోజు కొత్త సంవత్సరం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
Next Story