Wed Nov 06 2024 01:38:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆలయాలన్నీ భక్తులతో కిటకిట
వైకుంఠ ఏకాదశి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
వైకుంఠ ఏకాదశి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాల్లో స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి, ద్వారక తిరుమల, మంగళగిరి పానకాల స్వామి వంటి దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి
ఐదు గంటల నుంచే...
ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. . ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాలను దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యంగా భక్తులు భావిస్తారు. అందుకే ఆలయాలన్నీ కిటకిట లాడుతున్నాయి.
Next Story