Sun Dec 22 2024 17:16:26 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : పోస్టల్ బ్యాలట్ విషయంలో కూటమి పార్టీలకు బిగ్ రిలీఫ్
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటులో కూటమి పార్టీలకు ఊరట లభించింది
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటులో కూటమి పార్టీలకు ఊరట లభించింది. బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా.. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్ వాలిడ్ చేయకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై కూడా గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నా సీల్ లేదని బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈసీ కీలక ఆదేశాలు...
ఓటరు తమ బ్యాలెట్ పేపర్ లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఏపీలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ ఆయన బాధ్యత అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఫెసిలిటేషన్ సెంటర్ గెజిటెడ్ అధికారి సంతకం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యత అని గుర్తు చేసింది.
Next Story