Sun Dec 22 2024 18:55:27 GMT+0000 (Coordinated Universal Time)
వారిది చంద్రబాబు స్కూలే
తనపై ఆరోపణలు చేసిన వారంతా చంద్రబాబు స్కూల్ కు చెందిన వారేనంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు
తనపై ఆరోపణలు చేసిన వారంతా చంద్రబాబు స్కూల్ కు చెందిన వారేనంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు తనపై చేసిన విమర్శలకు వల్లభవనేని వంశీ ఘాటుగా విమర్శించారు. తనను విమర్శించే వాళ్లంతా జస్టిస్ చౌదరులా? అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు తనను గెలిపించారని, ఏమైనా ఇబ్బందులు ఉంటే అథినాయకత్వానికి చెప్పుకోవాలని సూచించారు.
సీఎంకు చెప్పుకోండి....
నిన్న యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఫైర్ అయ్యారు. వారికి బాధగా ఉంటే ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకోవాలన్నారు. తాను ఎమ్మెల్యేనని, తనకే పార్టీ బాధ్యతలను అప్పగించిందన్న విషయాన్ని వంశీ గుర్తు చేశారు. పని చేయకుండా హడావిడి చేయడం కాదని, తనను విలన్ అన్న వారు వారేమైనా హీరోలా? అంటే వల్లభనేని వంశీ నిలదీశారు. మొత్తం మీద గన్నవరం వైసీపీలో నేతల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి
Next Story