Mon Dec 23 2024 03:02:19 GMT+0000 (Coordinated Universal Time)
Drugs : విశాఖ డ్రగ్స్ డీల్లో కీలక అంశాలివే...యాభై వేల కోట్ల విలువైన
విశాఖ పోర్టులో పట్టుబడ్డ ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ విలువ యాభై వేల కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు.
విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. విశాఖ పోర్టులో పట్టుబడ్డ ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ విలువ యాభై వేల కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఈ డ్రగ్స్ ను బ్రెజిల్ నుంచి తెప్పించిన సంధ్యా కంపెనీ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా కంపెనీ పేరు ఉండటంతో ఆ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ యజమానులతో పాటు, ఉద్యోగులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సంధ్యా ఆక్వా కంపెనీ చుట్టు ఉచ్చు బిగుసుకునే అవకాశాలున్నాయి. అయితే తాము రొయ్యల మేతలో వినియోగించే డ్రై ఈస్ట్ కు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదని కంపెనీ యజమానులు చెబుతున్నారు. తాము సీబీఐ విచారణకు సహకిస్తామని చెబుతున్నారు.
యాభై వేల కోట్ల విలువైన...
నిన్న విశాఖ సీపోర్టులో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ, కస్టమ్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ డగ్స్ ను బ్రెజిల్ నుంచి తెప్పించిన దానిపై లోతైన విచారణ చేపట్టనున్నారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ను తెప్పిస్తున్నారంటే గతంలోనూ ఇదే తరహాలో ఈ ముఠా స్మగ్లింగ్ కు పాల్పడిందన్న అనుమానాలున్నాయి. ప్రతి నెల ఐదు నుంచి ఆరు కంటైనర్లలో డ్రై ఈస్ట్ వస్తుండటంతో దీని మాటున డ్రగ్స్ రవాణా అవుతుందన్న అనుమానాలున్నాయి. దీనిని నివృత్తి చేసుకునే దిశగా విచారణ సాగనుంది.
Next Story