Mon Dec 23 2024 13:56:24 GMT+0000 (Coordinated Universal Time)
3 గంటల్లో సికింద్రాబాద్ టు విజయవాడ
వందే భారత్ రైలు రైలు కేవలం మూడు గంటల్లోగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకుంటుంది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం , విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ ల మధ్య ఈ రైలు నడవనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ రైలు కేవలం మూడు గంటల్లోగా విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది.
గంటకు 180 కి.మీలు...
ఈ రైలు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఇవి దేశంలో ఇప్పటి వరకూ నాలుగు మాత్రమే పట్టాలెక్కాయి. ఐదోది మైసూరు - బెంగళూరు - చెన్నై మధ్య ప్రారంభించారు. గత ఏడాది నవంబరు 10న దీనిని ప్రారంభించారు. ఆరో రైలుగా సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య నడుపుతున్నారు. అన్ని స్టేషన్లలో ఈ రైలు ఆగదని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story