Mon Dec 23 2024 09:05:45 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ కలిశారు.. వైరల్ అయింది
వంగవీటి రాధ, మంత్రి కొడాలి నాని మంచి స్నేహితులు. వారిద్దరూ ఎప్పుడు కలిసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.
వంగవీటి రాధ, మంత్రి కొడాలి నాని మంచి స్నేహితులు. వారిద్దరూ ఎప్పుడు కలిసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. వేర్వేరు పార్టీల్లో ఉన్నా వారు కలసినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. జోకులు వేసుకుంటారు. అలాంటి స్నేహితులు మళ్లీ మరోసారి కలవడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగిపోయాయి. గుడివాడ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీ మరణించారు. ఆయన అంతిమయాత్రలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు.
ఒకే ఆటోలో...
ఇద్దరూ ఒకే ఆటోలో కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకున్నారు. ఈ మాటలకు ఎవరి అర్థాలు వారు తీస్తున్నారు. పార్టీ మారాలని కొడాలి నాని రాధాను అడిగారని, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని కొందరు ప్రచారం చేస్తుండగా, గుడివాడలో పోటీ విషయంపై రాధాను కొడాలి నాని ఆరా తీశారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాని, ఫొటో చూసి పలు అర్థాలను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తీసేస్తున్నారు.
Next Story