Sun Nov 17 2024 22:33:26 GMT+0000 (Coordinated Universal Time)
వారి సమక్షంలో వంగవీటి రాధా నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?
వంగవీటి రాధా.. ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు పరిచయం అవసరం లేని పేరు
వంగవీటి రాధా.. ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు పరిచయం అవసరం లేని పేరు. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. అతికొద్ది మంది సమక్షంలో రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈ కార్యక్రమం జరిగింది. నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు తదితరులు హాజరయ్యారు. ఆగస్టు- 19నే నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ 3న నిశ్చితార్థం నిర్వహించారు. ఇక వంగవీటి రాధా- పుష్పవల్లిల వివాహం అక్టోబరు 22న సాయంత్రం 7:59 గంటలకు వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు.
జక్కం పుష్పవల్లి స్వస్థలం నరసాపురం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి. పుష్పవల్లి తల్లిదండ్రులు బాబ్జి, అమ్మాణి టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అమ్మాణి గతంలో మునిసిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ జనసేన పార్టీలోకి వెళ్లారు. నరసాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ రెండు రోజులు జక్కం బాబ్జీ నివాసంలోనే బసచేశారు. ఈమె తండ్రి బాబ్జీ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంపాటు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నారు.
Next Story