Mon Dec 23 2024 08:28:14 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ తో వంగవీటి రాధా
పీలేరు నియోజకవర్గంలో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆయన యువగళం పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. ఎక్కడికక్కడ స్థానికులతోనూ, సామాజికవర్గాల ప్రజలతోనూ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు.
పాదయాత్రలో...
ఇక లోకేష్ పాదయాత్రకు పార్టీ నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇటీవల టీడీపీలో కొత్తగా చేరిన కన్నా లక్ష్మీనారాయణ వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు మరో నేత వంగవీటి రాధా పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆయనతో కలసి నడిచారు. వంగవీటి రాధా లోకేష్ తో సమావేశమై చర్చలు జరిపారని తెలిసింది. అనంతరం ఇందిరమ్మ నగర్ లో ముస్లిం సామాజికవర్గం ప్రజలతో లోకేష్ సమావేశమై వారితో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. మైనారిటీలపై దాడులు పెరిగాయని లోకేష్ అన్నారు.
Next Story