Sun Dec 22 2024 16:27:07 GMT+0000 (Coordinated Universal Time)
వారణాసిలో గెలిచిన మోదీ!!
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాలలో వారణాసి
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాలలో వారణాసి ముఖ్యమైనది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం నుండి వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019లో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, BSP అభ్యర్థి అథర్ జమాల్ తో పోటీ పడ్డారు.
మొదట కొన్ని రౌండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. ఆ తర్వాత మోదీ పుంజుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 152513 ఓట్ల తేడాతో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. భారత ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, మోదీకి 612970 ఓట్లు రాగా, రాయ్ 460457 ఓట్లు సాధించారు.
Next Story