టిటిడి కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు నో ఎంట్రీ
తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇతర మతాల గుర్తులు, దేవతా చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు..
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నాడు తిరుమలలో ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు ఉన్న వాహనాలను అనుమతించబోమని ప్రకటించింది. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇతర మతాల గుర్తులు, దేవతా చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు తీసుకెళ్లకూడదని టీటీడీ మరోసారి తెలిపింది. ఈ నియమం కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉందని తెలిపింది. అయితే ఈ నిబంధనను పట్టించుకోకుండా కొందరు భక్తులు ఇతర మతాలకు చెందిన చిహ్నాలు, రాజకీయ నేతలు, ప్రముఖుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు పెట్టుకుని తిరుమలకు వస్తున్నారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్ అధికారులు అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ.. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనదారులకు నిబంధనలను వివరించి స్టిక్కర్లు, జెండాలను తొలగించారు. ఈ ముఖ్యమైన నిబంధనను భక్తులు తెలుసుకుని నిర్వహణకు సహకరించాలని కోరారు.