Sun Dec 22 2024 23:53:27 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి నెల్లూరు జిల్లాలో వెంగమాంబ పేరంటాలు
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఉషశ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
వెంగమాంబ తిరునాళ్లకు ఏపీ నుంచి మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. ఇతర జిల్లాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా వెంగమాంబ తిరునాళ్లకు వచ్చిన ఈ పేరంటాలకు హాజరవుతారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి , పక్కల జిల్లాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
Next Story